జవహర్‌నగర్/కీసర జూలై 11: ప్రజా ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని.. డంపింగ్‌యార్డ్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుందని, నిర్భంధాలతో అణగదొక్కాలని చూస్తే మరింత ఉధృతంగా ఉద్యమం సాగుతుందని డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ షేక్షావలి హెచ్చరించారు. దమ్మాయిగూడ జేఏసీ లారీల బంద్‌లో భాగంగా జవహర్‌నగర్, దమ్మాయిగూడ, యాప్రాల్, కీసర మండల డంపింగ్‌యార్డ్ పోరాట కమిటీ సభ్యులను శనివారం అర్ధరాత్రి ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని షేక్ షావలి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు మండలాల ప్రజలను దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డంపింగ్‌యార్డ్‌ను శాశ్వతంగా తొలగించే వరకు ఊరుకోమని, అరెస్ట్‌లు, కేసులతో భయపడేదే లేదని, మిలిటెంట్ ఉద్యమాలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శాంతియుతంగా నిరసలు తెలుపుతున్న ఉద్యమకారులపై నిర్బంధకాండ మోపడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదని కన్నెర్ర చేశారు. ప్రభుత్వం మొండి వైఖరని విడనాడి శాస్త్రవేత్తల సూచనల మేరకు డంపింగ్‌యార్డ్ తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బొల్లారం, అమీర్‌పేట, శామీర్‌పేట, కీసర పోలీస్స్టేషన్లకు డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి తరలించారన్నారు. కొండల్ ముదిరాజ్, శ్రీకాంత్‌యాదవ్, శంకర్‌గౌడ్, లలితాయాదవ్, సందీప్, ఈగరాజు, రాములు, నరేశ్, కోటేశ్గౌడ్, ఉమామహేశ్, శివన్నారాయణ, చంద్రమౌళి, సునీత, సావిత్రి, కాలేష, వేణు, సుమారు 200 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం..
డంపింగ్‌యార్డును ఎత్తివేయాలంటూ జేఏసీ నేతలు తుంగ ధర్మేందర్, కోల కృష్ణయాదవ్, శ్రీనివాస్‌గౌడ్, దుర్గాప్రసాద్‌గౌడ్ కీసర సర్కిల్లోని అహ్మద్‌గూడ చౌరస్తాలో ఆందోళన చేశారు. రాంకీ సంస్థ డౌన్ డౌన్ అంటూ నినదించారు.డంపింగ్ యార్డును ఎత్తివేసే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో సాయినాథ్‌గౌడ్, నర్సింగ్‌రావు, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, నాగేశ్‌గౌడ్, సుమతి, రామారావు, కార్తీకగౌడ్ తదితరులు పాల్గొన్నారు.