జూబ్లీహిల్స్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణతో పాటు ఉపాధి కల్పించిన పథకాలు అమలుచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అవసరమైన అనేక పథకాలను ఎన్నికల హామీలతో సంబంధం లేకుండా ప్రవేశపెట్టారని ఉద్ఘాటించారు. రహ్మత్‌నగర్ డివిజన్లో 14 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.5,97,500/- విలువైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదింట్లో పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణులకు కేసీఆర్ కిట్, అన్నదాతకు రైతు బంధు వంటి అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందిన విన్నూత్న పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆసరా ఫెన్షన్లు రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ పథకాలపై ప్రజలకు ఉన్న ఆదరణే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగరాజ్, అరుణ్, చోటు, అహ్మద్ పటేల్, వాజీద్, లియాకత్, బషీర్, రాకేశ్ క్రిష్టోర్, కేఎన్ రెడ్డి, వినోద్, రమేశ్, రాజ్ కుమార్, రాకేశ్, తరుణ్, రఘు, విజయ్, జగన్, స్రవంతి, రమాదేవి, సునీతాదేవి, దుర్గాదేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్లో కొత్త రేషన్ కార్డుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సివిల్ సైప్లెస్ ఏఎస్ఓ జ్యోతి, సివిల్ సైప్లె ఇన్స్పెక్టర్ విక్రమ్, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.