నాంపల్లి కోర్టులు, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్ పీఎస్పరిధిలో నమోదైన మైనర్ పై లైంగికదాడి కేసులో నిందితుడికి కోర్టు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. దాంతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డి.రమాకాంత్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముకుంద్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో ఓ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు చార్జీషీట్ దాఖలు చేశారు.
పోక్సో చట్టంతో పాటు 354-ఎ (బాలికపై అసభ్య ప్రవర్తన) కింద జిల్లా కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో శిక్షలు ఖరారు చేసింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.సతీశ్ సమక్షంలో సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసి చార్జీషీట్ను కోర్టుకు సమర్పించారు. బెయిల్ బాండ్లు కోర్టుకు సమర్పించడంతో నిందితుడిని విడుదల చేస్తూ కోర్టు ఆదేశించింది. భరోసా అధికారి టి.కల్పన, ఎస్సైలు గోవర్ధన్, భరత్భూషణ్ ఈ కేసుకు సహకరించారు. జరిమానా చెల్లించని సమక్షంలో అదనంగా మూడు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.