అబిడ్స్, జనవరి 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలని టీఆర్ఎస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కోరారు. వైదిక్ వచనాలయ్ లైబ్రరీలో అగర్వాల్ సమాజ్ తెలంగాణ సౌత్ జోన్ ఆధ్వర్యంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా మెగా వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం బండి రమేశ్ మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోవడంతోనే రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నదన్నారు. మెగా వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేసిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ గ్రేటర్ అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్‌రావు గుప్తా, మనీష్ కుమార్ అగర్వాల్, శేషుకుమార్ గోయల్, సలావుద్దీన్ లోధి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వ్యాక్సినేషన్.. అభినందనీయం
అబిడ్స్, జనవరి 30: స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. కోల్సావాడిలో పారీక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. అనంతరం రాకేశ్ జైస్వాల్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శైలేందర్ యాదవ్, నిత్య పారీక్, సురేశ్ టోల్డి, ప్రదీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.