విడాకులివ్వడం లేదని..భార్య గొంతుకోసి హత్య
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
- కాలయముడైన కానిస్టేబుల్
వనస్థలిపురం, మే 12 : నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామానికి చెందిన శోభ(37), సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహుల గూడెంకు చెందిన కుంచం రాజ్‌కుమార్(38)తో 15సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు సాత్విక్(14), లిఖిత్(11) ఉన్నారు. ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌కు తరచుగా బదిలీలు జరిగేవి.
హైకోర్టు కాంప్లెక్స్‌లో విధులు
గత 6సంవత్సరాల నుంచి భార్యతో చిన్నపాటి గొడవలు మొదలై అవి పెద్దవిగా మారాయి. నాలుగేండ్ల కిందట యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో శోభ భర్తపై కేసు పెట్టింది. ఆ తర్వాత కూడా రాజ్‌కుమార్ తీరు మారలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని హైకోర్టు కాంప్లెక్స్‌కు బదిలీ అయ్యాడు. వనస్థలిపురం గౌతమినగర్ కాలనీలో నివాసముంటూ విధులు నిర్వహిస్తున్నాడు. కానీ భార్యను వేధించడం మాత్రం మానలేదు. తనకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు.
డ్యూటీ నుంచి కత్తితో ఇంటికి
ఈ నేపథ్యంలో గురువారం రాజ్‌కుమార్ ఉన్నతాధికారులను కలిసిన శోభ తనను వేధిస్తున్న తీరును వివరించింది. దీంతో సాయంత్రం డ్యూటీకి వెళ్లిన రాజ్‌కుమార్‌ను పిలిచిన అధికారులు ఇంట్లో జరుగుతున్న గొడవలు, శోభ ఫిర్యాదుపై విచారణ జరిపారు. భార్యతో సరిగా ఉండాలని సూచించారు. దీంతో శోభపై కోపం పెంచుకున్న రాజ్‌కుమార్ రాక్షసుడిలా మారాడు. శుక్రవారం డ్యూటీ నుంచి ఇంటికి వస్తూనే కత్తిని తీసుకుని వచ్చాడు. రాత్రి 9:40 గంటలకు ఇంటికి రావడంతోనే గొడవకు దిగాడు. దాడిచేసి కిందపడేసి కొట్టాడు. దీంతో మొదటి అంతస్తులో ఉన్న శోభ కిందికి దిగి పారిపోయేందుకు యత్నించింది. గేటు సమీపంలోకి రాగానే వెనుకనుంచి జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. పెద్ద కుమారుడు సాత్విక్ అడ్డుకునేందుకు యత్నించగా అతడిపై దాడి చేశాడు. దీంతో రెండు చేతులకు కత్తి గాయాలయ్యాయి. భయపడిన సాత్విక్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. సాత్విక్ పారిపోవడంతో రాజ్‌కుమార్ మరింత ఆగ్రహంతో శోభను అదిమి పట్టుకుని గొంతుకోశాడు. దీంతో రక్తం మడుగులో పడిపోయింది. అనంతరం కత్తితో సహా రాజ్‌కుమార్ పరారయ్యాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సాత్విక్ విషయం చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న శోభను వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కుమారుడు సాత్విక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

