
వనస్థలిపురం, ఆగస్టు 26 : దేశంలో దళిత, గిరిజన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంది తప్ప చేసిందేమీ లేదని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహ్మారావు అన్నారు. దళితులను మోసం చేసేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న దీక్షలపై నిసరన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి బీఎన్‌రెడ్డినగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్య కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్రవేశపెట్టగానే కాంగ్రెస్, బీజేపీలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయన్నారు.
ఇంద్రవెళ్లిలో ఆదివాసీలను, ఖమ్మం జిల్లా ముదిగొండలో పేదలను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.10లక్షలు ప్రభుత్వం ఇస్తుంటే వీరికి కడుపు మంట ఎందుకని ప్రశించారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల నాగార్జున గౌడ్, నర్రా ప్రశాంత్‌రెడ్డి, పసునూరి శ్రీనివాస్‌రెడ్డి, మేకల శ్రకాంత్, యాదయ్య, మధుకర్‌రెడ్డి, వినోద్, విక్రమ్, సాయి తదితరులు పాల్గొన్నారు.