మేడ్చల్, ఫిబ్రవరి 4 : హామీల అమలు చేయకుండా ప్రజలను వచించిన కాంగ్రెస్‌ను మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని, మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జగ్గన్‌గూడ, సంపన్‌బోల్, ఉద్దెమర్రి గ్రామాల్లో పర్యటించారు.
ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది మాటల ప్రభుత్వమని, బీఆర్ఎస్ది చేతల ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి గజ్జెల నాగేశ్, చామకూర భద్రారెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు విష్ణువర్దన్ రెడ్డి, సంగారెడ్డి, కవిత, సత్యమ్మ, మాధురి, రాజిగళ్ల సుజాత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, నాయకులు.. అనిల్, ఇస్తారి, ఆది రమేశ్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
మున్సిపల్ ఎన్నికల వేల మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కొల్తూర్‌కు చెందిన కురుమ సంఘం నాయకులు బోదరి యాదగిరి గౌడ్, రేగు లచ్చయ్య, రేగు నగేశ్, రేగు శ్రీను, బోదరి వెంకటేశ్, రమేశ్, ఏటికపల్లి మల్లేశ్, శేఖర్, లస్కర్ శ్రీశైలం, లస్కర్ రాజు, చరణ్, సత్యనారాయణ, బాబులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి బీఆర్ఎస్లో చేరారు. ఉద్దమర్రికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు.
మర్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక..
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాట్లపల్లి సంపత్ అనుచరులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం..
శామీర్ పేట: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్రంపై పెద్ద శని కూర్చుందని, ఆ శని పోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలపించాలని మాజీ మంత్రి, మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అలియాబాద్‌లో ప్రతి రోడ్డు, ప్రతి గల్లీ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని మల్లారెడ్డి పేరొన్నారు.
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.70 లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేశామని తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక పథకం కూడా లేదని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. కారు గుర్తుకు ఓటువేసి అలియాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ ఎన్నికల ఇన్చార్జి, మలాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.