MAL Jagadish Reddy Birthday | మెల్బోర్న్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (Australia) నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే (MLA) గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి, నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగ మార్చి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జగదీశ్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలో ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యారావు కాచవరపు, ఉదయ సింహా రెడ్డి, సతీశ్ పులిపాక, సురేందర్ రెడ్డి తిమ్మాపురం, శ్రీకాంత్ మొగుళ్ల, అన్నే అన్వేష్ రెడ్డి, మనీశ్ కల్యాణ, ప్రణయ్ రెడ్డి ఇనుముల, శివ వంగూరి, మాజిద్ పాల్గొన్నారు.