Colour Papadams Ban | భోజనంలో పాపడాలు, చిప్స్ లాంటివి తినడం చాలామందికి అలావాటే. వ్యాపారవేత్తలు తమ విక్రయాలు పెంచుకునేందుకు, భోజన ప్రియులను ఆకట్టుకునేందు రంగురంగు పాపడాలను తయారు చేస్తున్నారు. పింక్ కలర్ కావాలిన ఒకరు, ఆరెంజ్ కావాలని మరొకరు ఇలా తమకు నచ్చిన రంగు పాపడాలను తినాలంటే తమిళనాడులో ఇక కుదరదు. ఎందుకంటే ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ (Joseph Vijay) రంగు పాపడాల, , చిప్స్‌పై నిషేధం విధించారు.
రంగు పాపడాల్లో ప్రమాదకరమైన రోడమైన్-బి (Rhodamine B) రసాయన రంగులను అధికారులు గుర్తించారు. ఇది
క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం అని, దీనివల్ల ప్రజలు రోగాలబారిన పడకుండా ఉండేందుకు ఈ నిషేధం విధించారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి ఈ రసాయన రంగు పాపడాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయ్ హెచ్చరిక జారీ చేశారు. కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం సూచించారు.
ఇటీవల తమిళనాడు ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ (FSD) అధికారులు తనిఖీలు చేయగా ఆహార పదార్థాల్లో సురక్షితం కాని, నిషేధిత, అధిక మోతాదులో రోడమైన్-బి రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనం కలిపిన ఉత్పత్తులను తినే పిల్లలు అలర్జీ, అటెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివ్ డిజార్డర్ (ADHD) వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని FSD హెచ్చరించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చట్టం ప్రకారం రంగుల పాపడాలను తక్షణమే నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మినపప్పు, వరి పిండి వంటి వాటితో స్వచ్ఛంగా తయారు చేసిన పాపడాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు.