సిటీబ్యూరో: తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మంగళవారం రోజు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా.. కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడంతో బోసిపోయి దర్శనమిస్తున్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ అవతరణ వేడుకలపై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అవతరణ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించడం లేదు. కేవలం జెండా ఆవిష్కరణ చేసి చేతులు దులుపుకొంటున్నారు.