కంటోన్మెంట్ భూములపై కాంగ్రెస్ రాజకీయం.. పరిహారం ఇప్పిస్తామంటూ ఆశలు
బీ3 భూములు కంటోన్మెంట్వే: అధికారులు.. హెచ్ఎండీఏ నుంచి పరిహారం పొందిన కంటోన్మెంట్.. తాజాగా భూముల పరిహారం పేరిట గందరగోళం
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ చేపట్టిన కంటోన్మెంట్ భూముల చిక్కులు ఇంక తొలగలేదు. ఓవైపు ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా నేలమట్టం చేయాలని చూస్తున్నారని ఇప్పటికే భూ యజమానులు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండే బీ3 ల్యాండ్ భూములతో మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఇన్నాళ్లు ఈ భూములకు హక్కుదారుడిగా కంటోన్మెంట్ ఉండగా.. వాటిని స్థానికులకు లీజు ప్రాతిపదికన కేటాయించినట్లుగా పేర్కొంది.
వీటికి పూర్తి యాజమాన్యపు హక్కులను తామే కలిగి ఉన్నామని స్పష్టం చేసింది. కానీ కంటోన్మెంట్‌కు చెందిన భూముల్లో ఉంటున్నవారికి కూడా పరిహారం ఇస్తామంటూ కాంగ్రెస్ భూ రాజకీయానికి తెరలేపింది. ఇక్కడే ఇన్నాళ్లు నల్లా కనెక్షన్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్సులతోపాటుగా, చివరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వందలాది మంది బతుకుతున్నారు.
దశాబ్దాల కాలంగా ఈ భూములే ఆధారంగా నిలిచిన వారికి పరిహారం దక్కుతుందని, లేని హక్కుల కోసం కంటోన్మెంట్, హెచ్ఎండీఏ కార్యాలయాల చుట్టూ తిరిగేలా ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. 42 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2 వేల వరకు బీ3 కేటగిరి భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కంటోన్మెంట్‌కు చెందినవి. జీవనోపాధి కోసం నిరుపేదలకు దశాబ్దాల కిందటే అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూములే ఆదాయ వనరులుగా నివాస, వ్యాపార భవనాలను నిర్మించుకున్నారు.
కానీ హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఈ భూముల అనుభవదారులకు ప్రమాదంగా మారింది. ముఖ్యంగా 16 కిలోమీటర్ల జేబీఎస్ నుంచి తూంకుంట వరకు నిర్మించే ఎలివేటెడ్ కోసం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే 250 మందికి పైగా ఈ భూములతో కుటుంబాలను పోషిస్తున్నారు. కానీ ఈ భూములను 90 ఏళ్ల తర్వాత కంటోన్మెంట్ బోర్డు మాత్రం తీసుకునేందుకు సిద్ధమైంది.
బీ3 భూములు ఎక్కడవి..
రక్షణ శాఖకు చెందిన ఈ భూములను స్థానిక ప్రజా అవసరాల కోసం వినియోగించే ప్రైవేటు ఆస్తులు. వీటిని రెసిడెన్షియల్, వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వాడుకోవచ్చని రక్షణ శాఖ భూముల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూములను ఎప్పుడో 90 ఏళ్ల కిందటే వీరికి అప్పగించగా, వారసత్వంగా వచ్చిన భూమిని ఆధారంగా చేసుకుని పక్కా నిర్మాణాలను చేపట్టుకున్నారు. కానీ ఎక్కడ యాజమాన్యపు హక్కులను ఇవ్వలేదని కంటోన్మెంట్ బోర్డు పేర్కొంది.
కాంగ్రెస్ భూ రాజకీయం
నిజానికి ఈ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న బీ3 భూములపై అనుభవదారులకు ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేవని తేల్చిన తర్వాతే.. హెచ్ఎండీఏ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు పరిహారంగా దాదాపు రూ. 350 కోట్లు మంజూరు చేసింది. వీటిని రక్షణ శాఖ భూములుగానే పేర్కొంది. కానీ ఇప్పుడు స్థానికంగా ఉండే కొందరు కాంగ్రెస్ నేతలు.. వాటితో రాజకీయానికి తెరలేపడంతో జనాలు గందరగోళానికి గురవుతున్నారు. గతంలోనే కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం ఉన్న ఆస్తులను లాక్కొనేందుకు ప్రయత్నించగా, కొందరు అనుభవదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో వందలాది కుటుంబాలను ఊరిస్తున్న సర్కారు… భూ పరిహారం పేరిట జనాలను మభ్యపెడుతుంది. అయితే దీనిపై స్పష్టతనివ్వాల్సిన హెచ్ఎండీఏ కూడా కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని, కంటోన్మెంట్‌కు గతంలోనే చెల్లించిన పరిహారంలోనే ఈ భూములు కూడా ఉన్నాయనే విషయాన్ని దాచిపెడుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

