సిటీబ్యూరో: సీఎన్జీ కొరత ఆటో డ్రైవర్లను ఇంకా వేధిస్తున్నది. ప్రస్తుతం సీఎన్జీ కిలో ధర రూ.99కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ఇంధన ట్యాంకులు గ్యాస్ కు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం మారెట్ లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్ జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. నగరంలో వాహనాల సంఖ్య 88 లక్షలు దాటిపోయింది.
సుమారు నాలుగు లక్షల వాహనాలు సీఎన్ జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్ జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒకో స్టేషన్ కు ప్రతిరోజు 6 వేల కిలో వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్ జీ, ఆటో గ్యాస్ తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయని చాలా మంది సీఎన్జీ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు.