మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక సమస్యతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి కొండంత భరోసాగా మారిందన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన 13 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు, మరో నలుగురికి ఈ పథకం కింద నిధుల మంజూరుకు సంబంధించిన పత్రాలను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ బుధవారం తన నివాసంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు ఎంతగానో దోహదపడుతున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, గౌతం గౌడ్,భద్రయ్య, శ్రీనివాస్,చంద్రశేఖర్, అనీల్, రాము,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.