Sky Walk | మెహిదీపట్నం స్కైవాక్‌కు తొలగిన అడ్డంకులు.. ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం
పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలను కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
- 3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం
- మే నెలాఖరున ప్రజలకు అందుబాటులోకి స్కైవాక్
Sky Walk | సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్ఎండీఏ చేపడుతున్న స్కైవాక్ నిర్మాణానికి కేంద్రం లైన్ క్లియర్ చేసింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలను కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
మెహిదీపట్నం రైతుబజార్ ఎదురుగా ఉన్న బస్టాప్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింద నుంచి రోడ్డు అవతల వైపు రూ.34 కోట్లతో అత్యాధునిక నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఒకవైపు రక్షణ క్యాంపస్ స్థలం ఉండడంతో భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించలేదు. దీంతో రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలాన్ని తమకు బదిలీ చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు రక్షణ శాఖ మంత్రిని కలిసి విన్నవించారు.
దీంతో గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. స్కై వే నిర్మాణానికి అవసరమైన మేరకు భూమిని కేటాయించేందుకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో వీలైనంత త్వరగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే మే నెలాఖరు నాటికల్లా ఈ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

