కొండాపూర్ : పరీక్షలున్నాయి చదువుకోమని తల్లి మందలించడంతో భయంతో బాలుడు ఇంటి నుంచి పారిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం… గౌతమీ నగర్, చందానగర్‌లో నివాసం ఉండే మారెడ్డి వంశీధర్‌రెడ్డి, శివలీలా రెడ్డి దంపతుల కుమారుడు ఎం సాయి లలిత్ రెడ్డి (14)కి సోమవారం నుంచి పరీక్షలు ఉండడంతో తల్లి చదువుకోమని మందలించింది.
పరీక్షల భయంతో ఆగస్టు 7వ తేదీ రాత్రి 9:30 గంటలకు సాయి లలిత్ రెడ్డి ఇంట్లో నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో తెలిసిన బంధువులను ఆరాతీయగా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశం తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9949936309, 9490617008 నెంబర్లకు సమాచారం అందించాల్సిందిగా తెలిపారు.