బంజారాహిల్స్,ఆగస్టు 13 : అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి నాలాలో పడి దుర్మరణం పాలయ్యాడు. బంజారాహిల్స్ రోడ్ నెం 1/12 చౌరస్తా సమీపంలోని బల్కా పూర్ నాలాలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.
సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఈ వ్యక్తి సమీపంలో చెత్తను ఏరుకుని జీవిస్తుంటాడని స్థానికులు తెలిపారు.
మద్యం మత్తులో నాలలో పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాలాకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తూ పడిపోయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.