బేగంపేట్ : హుస్సేన్‌సాగర్ నీటిలో తేలియాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం రాంగోపాల్‌పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో సాగర్ నీటిలో ఓ వ్యక్తి మృతదేహాం ఉన్నట్టు సందర్శకుల ద్వారా సమాచారం అందుకున్న రాంగోపాల్‌పేట్ పోలీసులు వెళ్లి ఆ మృతదేహాన్ని వెలికి తీశారు.
మృతుని వద్ద లభించిన ఆధార్‌కార్డ్ ఆధారంగా మెదక్ జిల్లా కంగిటి మండలం దిగులవాడి గ్రామానికి చెందిన చల్లా సంగమేశ్వర్‌రెడ్డి (35) గా గుర్తించారు. కాగా మృతుని పూర్తి వివరాలు తెలియలేదు. రాంగోపాల్‌పేట్ పోలీసులు కంగిటి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచినట్టు పోలీసులు తెలిపారు.
సంబంధీకులు సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.