ఇరవై ఏండ్ల కల నిజమైంది..
జవహర్‌నగర్‌లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 58 ద్వారా పేదలకు పట్టాలకు అందజేస్తామని తెలిపిన ప్రభుత్వం.. పట్టాలు పంపిణీ చేస్తున్నది.
- జవహర్‌నగర్‌లో 3,619 ఇండ్లపట్టాలు అందజేత
- వాతావరణంలో స్థానికులు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
జవహర్‌నగర్, ఏప్రిల్ 17: జవహర్‌నగర్‌లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 58 ద్వారా పేదలకు పట్టాలకు అందజేస్తామని తెలిపిన ప్రభుత్వం.. పట్టాలు పంపిణీ చేస్తున్నది.
దశాబ్దాల కల సాకారం..
తెలంగాణ ప్రభుత్వం జీవో 58 తీసుకువచ్చి పేదలకు కొండంత అండగా నిలించింది. పేద ప్రజలకు పట్టాలు అందించడంతో వారి దశాబ్దాల కల సాకారం కావడంతో శంతోషం వ్యక్తం చేశారు.
జవహర్‌నగర్‌లో అత్యధికంగా ..
మేడ్చల్ నియోజకవర్గంలోనే జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు అత్యధికంగా 3,619 పట్టాలు మంజూరయ్యాయి. ప్రజలందరూ జీవో 58కింద దరఖాస్తు చేసుకోగా ప్రభు త్వం పట్టాలను ఉచితంగా అందజేసింది.
కార్పొరేషన్‌పై కేటీఆర్ ప్రత్యేక నజర్..
పేదలు నివసించే జవహర్‌నగర్ కార్పొరేషన్‌పై మంత్రి కేటీఆర్ ప్రత్యేక నజర్ పెట్టారు. ప్రజలు తాగునీటికి అవస్థలు పడొద్దని మిషన్ భగీరథతో వేలాది రూపాయయాలు వెచ్చించి ప్రతి ఇంటికీ తాగునీరందించారు. అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న జవహర్‌నగర్ సమస్యలు కూడా భారీగానే ఉండేవి. మంత్రి కేటీఆర్ దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ రూ. 25కోట్లు మంజురు చేశారు. తాజాగా మరో 30కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. దీంతో పెండింగ్‌లో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతున్నాయి.
సీఎం దయతోనే..
సీఎం కేసీఆర్ సార్ దయతోనే 20ఏడ్ల కల సాకారమైంది. తెలంగాణ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జ రిగింది. అభివృద్ధి పనులు కూడా ప రుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్నాను. ఉచితంగా పట్టాను మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
– మీసాల పద్మజ, ప్రగతినగర్
ప్రభుత్వానికి రుణపడి ఉంటా
పట్టాలు అందజేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. రాజీవ్‌గాంధీనగర్‌లో ఇండ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 58 జీవోతో నా ఇంటికి పట్టాను అందజేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది.
– నల్ల ఎల్లమ్మ, రాజీవ్‌గాంధీనగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

