బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్‌పేట్ డివిజన్లోని ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాల విద్యార్ధులకు ప్లాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 6289 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తరగతి గదులు, ప్రహారిగోడల నిర్మాణం, పర్నీచర్ కొనుగోలు వంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
పేద మధ్య తరగతి విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ట్యాబ్‌లను అందించిన ప్లాన్ ఇండియా సంస్థ ప్రతినిధులకు మంత్రి అభినందించారు. 7,8,9 తరగతులకు చెందిన 111 మంది విద్యార్థినీలకు ట్యాబ్‌లను అందజేస్తున్నట్టు నిర్వహాకులు మంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖధికారి రోహిణి, డిప్యూటీ డీఈవో సురేశ్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యుయులు ఉమాదేవి. ప్లాన్ ఇండియా ప్రోగ్రాం ఆఫిసర్ తుషార్కాంతిదాస్, కస్తూరి,కుమారి, సుమన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.