హైదరాబాద్ ( మైలార్‌దేవ్‌పల్లి) : తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉద్భవించిన బీఆర్ఎస్ పదేండ్లలోప్రజా అవసరాలను తీర్చడంలో ముందంజలో ఉందని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ (Mla Prakash Goud) పేర్కొన్నారు. బీఆర్ఎస్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ అతహుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లి్ం, మైనార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలందరికీ అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్ (BRS) ఒక్కటేనని వెల్లడించారు. నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. వీడీసీసీ రోడ్లు, అత్యాధునిక వీధిదీపాలు, హైమాస్ లైట్లు వేయించామని వివరించారు. బీఆర్ఎస్ ఉత్తుత్తి హామీలు ఇవ్వదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, వీటితో ఎంతో మంది లబ్ధిపొందుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మవద్దని కోరారు.
యువత ఉపాధి కల్పనకు అన్ని రకాలుగా కృషి చేశానని వందలాది మహిళా పొదుపు సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. చిరువ్యాపారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, ఫజల్ ఆలీ, సన్నాఉల్లా, ఖలీల్, అజీజ్, అన్వర్ పాల్గొన్నారు.