రెండో దశ రైతాంగ పోరాటానికి సిద్ధం
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు పిలుపునిచ్చారు.
- 15న రాజ్యాంగ రక్షణ కార్యక్రమాలు
- సెప్టెంబర్, అక్టోబర్లలో పాదయాత్రలు
- నవంబర్లో హైదరాబాద్లో ధర్నా
- సయుక్త కిసాన్ మోర్చా సదస్సులో నేతల వెల్లడి
చిక్కడపల్లి, ఆగస్టు11: దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మోర్చా సదస్సు జరిగింది. కనీస మద్దతు ధరల చట్టం, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి హామీల అమలును విస్మరించిన ప్రభుత్వ వైఖరిపై మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తామని మోర్చా నేతలు తెలిపారు.
ఈ నెల 15న ‘స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో కార్యక్రమాలు చేపడతామని, ఈ నెలాఖరులోగా అన్ని జిల్లా కమిటీల ఏర్పాటు చేసి జిల్లా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్లో అన్ని జిల్లాల్లో పాద, వాహన యాత్రలతో ప్రచార ఉద్యమం, నవంబర్ 26, 27, 28 తేదీల్లో వేలాది రైతులతో మూడురోజులపాటు హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ప్రతినిధులు హన్నన్ మొల్లా, రావెల వెంకయ్య, రామిందర్ పాటియాలా, వడ్డే శోభానాద్రీశ్వరరావు, రాయల చంద్రశేఖర్, విస్సా కిరణ్కుమార్, చిట్టిపాటి వెంకటేశ్వరరావు, గిరీష, గాదగోని రవి, ప్రసాద్, నారాయణరావు, వేముపల్లి వెంకటరామయ్య, టీ సాగర్, పశ్య పద్మ తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

