Hyderabad | హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో మహా గణపతిని చూసి తరించేందుకు భక్తులు.. హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ముఖ్యంగా కాచిగూడ, రాంనగర్, కొత్తపేట, మిథానీ, బోడుప్పల్, మేడిపల్లి, మల్కాజిగిరి, నేరేడ్మెట్, గచ్చిబౌలీ, పటాన్ చెరువు, కొండాపూర్, రాజేంద్రనగర్, అఫ్జల్ఘంజ్, జీడిమెట్ల, గండిమైసమ్మ, లింగంపల్లి, కేపీహెచ్బీ, పటాన్ చెరు తదితర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటి పర్యవేక్షణకు కోఠి, రేతిఫైల్లో కమ్యునికేషన్ విభాగాలను ఏర్పాటు చేశారు. బస్సుల సమాచారం కోసం 9959226160, 9959226154 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.