TGSRTC | మణికొండ, మే 3 : మణికొండ మర్రిచెట్టు బస్టాప్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. మణికొండ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని మీ పార్శిల్స్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు బుకింగ్ చేసుకోని పంపించుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థమే ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమలో ఆర్టీసీ అధికారులు ఏటీఎం పాల్, డీఎంఈ రమేష్, ఏజెంట్ రమేష్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్‌రావు, రాజేష్, ముత్యాలు, శ్రీనివాస్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.