జూబ్లీహిల్స్: పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థులకు అపరిచితులు చాక్లెట్లు ఇస్తే తీసుకోవద్దని.. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాలకు దగ్గరగా ఉన్న పాన్ షాప్‌లు, కిరాణా షాప్‌లలో డ్రగ్స్ సంబంధిత చాక్లెట్లు, ఇతర వస్తువులు అమ్మితే ప్రహరీ కమిటీకి, 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి. పరమేశ్వరమ్మ ఎస్ సీ హెచ్వోగా నలుగురు ఉపాధ్యాయులు, విద్యార్ధులతో కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్ధులతో డ్రగ్స్‌ను తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేయించి ..ఉపాధ్యాయులతో కలిసి యూసుఫ్‌గూడ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.