అంబర్పేట, జూలై 14: బాగ్ అంబర్పేట డివిజన్ తురాబ్నగర్లో తుప్పుపట్టడంతో పాటు వంగిపోయి ప్రమాదకరంగా మారిన హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులు సోమవారం పరిశీలించారు.
నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం ఈ విషయమై హైటెన్షన్ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీపీడీ ఏడీఈ జీ నాగేశ్వరరావు, ఏఈ శ్రీనివాస్ తురారనగర్లోని స్తంభాన్ని పరిశీలించారు. త్వరలో స్తంభాన్ని మారుస్తామని తెలిపారు.