హైదరాబాద్ : పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్కూల్లో పని చేస్తున్న ఓ టీచర్ రెండో తరగతి హిందూ విద్యార్థితో ఉర్దూలోని కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. స్కూల్ డైరీలోనూ అదే విషయాన్ని రాశాడు. గమనించిన బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఈ విషయంపై టీచర్‌ను నిలదీశారు.
విషయం పలు ఇందూ సంఘాలు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.