హైదరాబాద్ : నగరంలోని మలక్‌పేట(Malakpet) పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు(Law student dies) పాల్పడింది. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించా రంటూ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమగ్ర విచారణ చేపట్టి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. గిరిజన సంఘాల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మలక్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ టెన్షన్
మలక్‌పేటలో గిరిజన యువతి అనుమానాస్పద మృతి
మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట… pic.twitter.com/1v9y9ZIEKf
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024