సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.0డిగ్రీలు, గాలిలో తేమ 40శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.