సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చలిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6డిగ్రీలు, గాలిలో తేమ 37శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా ఉదయం వేళలో గ్రేటర్ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరానికి ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.