Bird Flu | సుల్తాన్ బజార్, ఫిబ్రవరి 15 : బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 9100797300 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ తమ పరిసర ప్రాంతాలలో, చుట్టుప్రక్కల ఎక్కడనైన విపరీతంగా పక్షులు చనిపోతే, వాట్సాప్ నెంబర్ 9100787300కు సమాచారాన్ని తెలుపాలని ఆయన ప్రజలను కోరారు.