అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా సోమవారం రైజ్ అండ్ రన్ పేరుతో 2కే, 5కే రన్ నిర్వహించారు. అలాగే సచివాలయ మహిళా ఉద్యోగులు బీఆర్కే భవన్లో సంబురాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించారు.
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంబర్‌పేట్‌లోని రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా సిబ్బందికి వక్తృత్వం, పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సంరక్షణకు షీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ గిరి జానకి, శ్రీబాల, సాయి శ్రీ, ఇందిరా దేవి, అనురాధ, అదనపు డీసీపీ నర్మద, షమీర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.