Telangana Saraswatha Parishath | తెలుగు యూనివర్సిటీ, జూన్ 26 : అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో పరిషత్తు నియమావళిని అనుసరించి నూతన అధ్యక్షులు శివారెడ్డి కార్యవర్గాన్ని ప్రకటించారు. పాతవారి స్థానంలో కొందరు సాహితీ ప్రముఖులకు ఈ సారి కార్యవర్గంలో స్థానం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉపాధ్యక్షులుగా తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జుర్రు చెన్నయ్య, కోశాధికారిగా మంత్రి రామారావు కొనసాగుతారని శివారెడ్డి తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ మసన చెన్నప్ప, డాక్టర్ సి. వసుంధర, ఆచార్య ఎస్.వి.రామారావు, ఆచార్య ఎన్.ఆర్. వెంకటేశం, మోతుకూరి నరహరి, డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, రింగు రామ్మూర్తి, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, గిరిజా మనోహర్ బాబు, డాక్టర్ టి. గౌరీ శంకర్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ ఏ సిల్మా నాయక్ లను, గౌరవ పరీక్ష కార్యదర్శిగా డాక్టర్ ఏ.సిల్మా నాయక్ ను నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యవర్గం 2030 వరకు కొనసాగుతుందని తెలిపారు.