మేడిపల్లి, జూన్ 5 : మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నారపల్లి సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్ట్రేషన్లపై తక్షణమే విచారణ చేయాలని కోరుతూ తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రేగు శ్రీశైలం తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్ట్రేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి మండల్ పరిధిలోని సాలార్ జంగ్ కంచె, సాయిప్రియనగర్ సర్వే నంబర్ 71లో పార్టు 4436/ 2026 ,4437/2025, 4438/2025, 4439/ 2025, 4440/2025, 4441/2025,4444/2025, 11 ప్లాట్స్ రిజిస్ట్ట్రేషన్లు అయ్యాయన్నారు.
ఈ ప్లాట్లకు ఇరువైపులా ఉన్న సర్వే నంబర్లు వేరుగా ఉండడమే కాకుండా జీపీఏ హోల్డర్, హద్దులు సైతం మారిపోయారన్నారు. లే అవుట్లో ఈ ప్లాట్స్ లేవన్నారు. అదే విధంగా పర్వతాపూర్ గ్రామంలో 1,2 సర్వే నంబర్లోని డాక్యుమెంట్ నంబర్ 2874/2026, 2875/ 2026 ఇందులో రంగారావు అనే పట్టాదారు కొన్ని సంవత్స రాల క్రితం చనిపోయాడని అతని వేలు ముద్ర వేసి పాస్ పోర్టు సైజ్ ఫొటో ఇచ్చినట్లుగా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అక్రమ రిజిస్ట్ట్రేషన్లపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు.