సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయుటకు ఎన్హెచ్ఎం/ఎంపీహెచ్ఎ(ఎఫ్), ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు గ్రేడ్-2 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 14నుంచి 19వ తేదీ సాయంత్రం 4గంటల లోపు తమ దరఖాస్తులను ///dmhohyd.online portal.org.in వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాల్సిందిగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకంటి తెలిపారు. పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలు, పోస్టుల సంఖ్య, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను www.hyderabad.telangana.gov.in వెబ్సైట్ను ద్వారా పొందవచ్చని చెప్పారు. కాంట్రాక్టు కాలం 31-03-2022 వరకు లేదా అవసరమున్నంత వరకు కొనసాగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.