మైనార్టీలకు సబ్సిడీ రుణాల మంజూరు
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
- దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్
- జారీ చేసిన జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ
- దరఖాస్తులకు జనవరి 5 వరకు గడువు
మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 19 : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార యూనిట్లు (చిన్న యూనిట్లు), వివిధ అనుబంధ వ్యాపారాల ఏర్పాటుకు అర్హులైన, ఆసక్తిగల మైనార్టీలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9000168256, 9492037940 సంప్రదించాలని కోరారు.
అర్హత.. ప్రమాణాలు..
- దరఖాస్తుదారులు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి.
- 21 నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే రూ. లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షలు ఉండాలి.
- దరఖాస్తుదారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్(ఆహార భద్రత కార్డు)
- దరఖాస్తుదారులందరూ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
- వెబ్ పోర్టల్ HTTP ః //TSOBMMS.CGG. GOV.IN / TSMFC వెబ్సైట్ TSMFC.IN
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 19.12.2022
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ 05.01.2023
- ఆఫ్లైన్లో దరఖాస్తులు అంగీకరించబడవు
హైదరాబాద్ జిల్లాలో కూడా..
హైదరాబాద్ జిల్లాలోని మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు మైనారిటీలు దరఖాస్తులు చేసుకోవడానికి ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధులు, జైనులకు సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైందన్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 5 వరకు గడువు విధించినట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాల కోసం httjp://tsobmms. cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

