సికింద్రాబాద్, జూన్ 2: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరపాలని ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌ను తెలంగాణ ఉద్యమకారుల సమితి చైర్మన్ బండి రమేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి పద్మారావు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
తార్నాక, ఇఫ్లూ కూడలి మధ్య స్మారక స్థూపం ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు బండి రమేశ్ తెలిపారు. విగ్రహ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని పద్మారావు గౌడ్ హామీ ఇచ్చారు.
sec2