చిక్కడపల్లి, జూన్ 28: తెలంగాణ కార్మిక శాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక నష్టపరిహారం ఇప్పించిందని హైదరాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ (డీసీఎల్) జాసన్ తెలిపారు. శనివారం ఆయన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ .. ఏన్టీపీసీలో చట్రగడ్డ ప్రభాకర్ రావు విధి నిర్వహణలో 2010లో మృతి చెందారు. నష్టపరిహారం కేసులో మొదట కరీంనగర్లో ఫైల్ చేశారని.. తరువాత ఆ కేసును హైదరాబాద్ ఏసీఎల్‌కు బదిలీ చేశారని తెలిపారు.
అప్పుడు తాను ఏసీఎల్ -3 గా ఉండగా ఈ కేసు పూర్వపరాలు పరిశీలించి.. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత కార్మిక నష్టపరిహార చట్టం ప్రకారం మృతుడి భార్య రేవతికి రూ.47, 66,100 ఇవ్వాలని, అది కూడా 2010 నుంచి 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.1,34,78,269 అయ్యిందని,. ఆ మొత్తం ఏన్టీపీసీవారు మృతుడి భార్య రేవతికి అందేసినట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించడం దేశంలోనే మొదటిసారని.. ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ సాధించిందని తెలిపారు.