హైదరాబాద్ : మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాగా, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే తలసానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెల్లంతో తులభారం వేశారు.