Tanzim Brits : పదమూడో సీజన్ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి శతకం నమోదైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ తంజిమ్ బ్రిట్స్(101) విధ్వంసక ఆటతో శతక గర్జన చేసింది. న్యూజిలాండ్ బౌలర్లను హడలెత్తి్ంచిన తంజిమ్ 87 బంతుల్లోనే సెంచరీకి చేరువైంది. వన్డేల్లో ఆమె మూడంకెల స్కోర్ సాధించడం ఇది ఎనిమిదోసారి. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన బ్రిస్త్ 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఏడో సెంచరీ బాదింది. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం మేగ్ లానింగ్ (Meg Lanning) రికార్డును బ్రేక్ చేసింది డాషింగ్ బ్యాటర్. లానింగ్ 44 ఇన్నింగ్స్‌ల్లో ఏడో శతకం నమోదు చేసింది.
అంతేకాదు ఒక క్యాలండర్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొట్టింది బ్రిస్త్. హల్లిడే వేసిన 31వ ఓవర్ల ఓసింగిల్ తీసి ఈ ఏడాది ఐదో శతకం తన ఖాతాలో వేసుకుందీ సఫారీ చిచ్చరపిడుగు. అనంతరం బాణం వదిలినట్టు ఫోజు పెట్టి సెలబ్రేట్ చేసుకున్న తను భారత ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) రికార్డును బ్రేక్ చేసింది. నాలుగు శతకాలతో మంధాన రెండో స్థానంలో కొనసాగుతోంది. వరుసగా రెండు సంవత్సరాలు (2024, 2025) టీమిండియా స్టార్ నాలుగు సెంచరీలో రికార్డు సృష్టించింది.
Unprecedented! What a year Tazmin Brits is having 🔥 #CWC25 pic.twitter.com/KhLYN3Zz0Q
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
న్యూజిలాండ్ నిర్దేశించిన 232 పరుగుల ఛేదనలో బ్రిస్త్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడింది. ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడి సఫారీల విజయానికి గట్టి పునాది వేసింది. సునే లుస్(56 నాటౌట్)తో రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన బ్రిస్త్. తుహువ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. అప్పటికీ స్కోర్.. 185/2. ఇంకా దక్షిణాఫ్రికా విజయానికి 47 రన్స్ కావాలంతే. చేతిలో ఎనిమిది వికెట్లు ఉండడంతో కివీస్ ఓటమిని తప్పించుకోవడం దాదాపూ అసాధ్యమే.