బాలానగర్, అక్టోబర్ 6 : పౌర ఆకాంక్షలు, సాంస్కృతిక వారసత్వం కాపాడటమే నా కర్తవ్యం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్‌గూడలో హనుమాన్ దేవాలయానికి స్వంత నిధులు రూ. 25 లక్షలుతో నిర్మింప జేసిన ముఖద్వారం (కమాన్) ను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆద్యాత్మిక అభివృద్ధి, సంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే తన లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.
స్థానిక ప్రజలు బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు శ్రీహనుమాన్ దేవాలయం ముఖ ద్వారాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. హనుమాన్ దేవాలయం ముఖద్వారాన్ని స్వంత నిధులతో నిర్మించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. ఆద్యాత్మికతతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోశిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రధాన్యత నిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, రాంచందర్, ఎండీ ఖాజా, ఎడ్ల ప్రభాకర్, ఎడ్ల సదానంద్, యాదయ్య, సూర్యనారాయణ, ఎడ్ల అశోక్, యెర్ర మహేశ్, మల్లారెడ్డి, పాశం కృష్ణాయాదవ్, బస్తీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.