హైదరాబాద్ : పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ కేసుపై విచారణకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. మృతుడి తల్లి కర్ల లలిత, మంద కృష్ణ మాదిగ, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఇతర సామాజిక కార్యకర్తలు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ల రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ పద్ధతులతో హింసించారని, తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించి కుటుంబ సభ్యులను కలవనీయలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
రాజేష్‌ను సబ్ జైలు నుంచి ప్రభుత్వ దవాఖానకు తరలించినప్పటికీ, కస్టడీలో జరిగిన తీవ్ర గాయాల కారణంగానే మృతి చెందాడని గమనించిన కమిషన్, ఈ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రత ఎక్కవగా ఉందని, దీంతో సమగ్ర విచారణ చేపట్టాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.