MLA Gopinath | మహిళా సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట : ఎమ్మెల్యే గోపీనాథ్
MLA Gopinath | మహిళా సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Gopinath ) అన్నారు.
ఎర్రగడ్డ : మహిళా సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Gopinath ) అన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ (CM KCR) సర్కారు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. బోరబండ డివిజన్‌కు చెందిన 19 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల (Checks)ను బుధవారం పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కల్యాణలక్ష్మి (Kalyanalaxmi), షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూపాయి అప్పు చేయకుండా ఆదుకుంటూ కేసీఆర్ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారన్నారు.
మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న కేసీఆర్ మహిళా బంధుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా పేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తున్న కేసీఆర్ ప్రభంజనాన్ని విపక్షాలు అడ్డుకోలేవన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సిరాజ్, రామకృష్ణ, ఖలీల్, వెంకటేష్, దేవమణి, సూర్యకళ, బాబానాయక్, రమేష్, ధర్మ, యూసుఫ్, షరీఫ్, సాయిచరణ్, అబ్బు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
నియోజకవర్గానికి చెందిన 500 పేద కుటుంబాలకు ఇటీవల డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయించడంతో బోరబండ డివిజన్‌కు చెందిన లబ్దిదారులు ఎమ్మెల్యే గోపీనాథ్‌ను సన్మానించారు. అనేక సంవత్సరాలుగా కిరాయి ఇండ్లల్లో ఉంటూ కష్టాలు పడ్డ తమను డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా అందజేసిన కేసీఆర్‌కు, సహకరించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

