ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ఘనంగా మేడే దినోత్సవం
జూబ్లీహిల్స్/ అమీర్‌పేట్/ బన్సీలాల్‌పేట్, మే1: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ‘మే డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షుడు అహ్మద్, యాదగిరి, బంగారి తదితరులు పాల్గొన్నారు.