Hydraa | సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ): హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బి-బ్లాక్‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాల సంరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం పీఎస్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలంటే మూడు కమిషనరేట్ల పరిధిలో, వివిధ పోలీస్స్టేషన్లలో కొంత ఇబ్బంది తలెత్తుతున్న నేపథ్యంలో హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి విన్నవించారు.
ఈ నేపథ్యంలో గత జూలై నుంచి హైడ్రా కార్యకలాపాలు, తర్వాత జరిగిన పరిణామాల కారణంగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఉండాలంటూ నిర్ణయించిన ప్రభుత్వ హోమ్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌కు ఒక ఏసీపీ అధికారి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులకు సంబంధించి ఇకపై హైడ్రా కమిషనర్ సూచనల మేరకు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం కలిగి ఉంటారు.