బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 12 : గాంధీ దవాఖాన నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. వాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 1981 బ్యాచ్‌లో ఎంబీబీఎస్, 1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993లో సహాయ ప్రొఫెసర్‌గా, 2006లో ప్రొఫెసర్‌గా కాకతీయ మెడికల్ కాలేజీలో పనిచేశారు.
2020లో రెండేండ్ల పాటు సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2024లో ఏడాది పాటు డీఎంఈగా విధులు నిర్వహించారు. అనంతరం అదనపు డీఎంఈగా ఉన్న ఆమెను గాంధీ దవాఖానకు సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన డాక్టర్ సీహెచ్ఎన్ రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు.