సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, సైబర్ సెక్యూరిటీ తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్)తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు ఓ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఎంవోయూపై సంతకం చేశారు. ఈ ఎంవోయూ ద్వారా జేఎన్టీయూ విద్యార్థులకు టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్ సహకారంతో హ్యాకథాన్, ఇంటర్న్‌షిప్, రీసెర్చ్‌కు సంబంధించి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, ఫ్యాకల్టీకి ఎఫ్డీపీఎస్, వర్క్‌షాప్స్, ఎస్టీటీపీఎస్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.
కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ అభిలాశ్ గుప్త, ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ మాధవీ లత, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.