సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): వాహన్ పోర్టల్‌కు సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నెల రోజులుగా పనివేళల్లో కొన్ని గంటల పాటు పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శనివారం సైతం నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో సేవలను సోమవారానికి రీ షెడ్యూల్ చేశారు. డ్రైవింగ్, ఫిట్నెస్, ఓనర్ షిప్ బదిలీ తదితర సేవలకు కోసం వచ్చిన వాహనదారులకు సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం, నాగోల్ తదితర కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి పోర్టల్ పనిచేయడం లేదని అధికారులు చేతులెత్తేయడంతో వాహనదారులు ఇంటిబాటపట్టారు.