వాహన్ పోర్టల్‌కు సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నెల రోజులుగా పనివేళల్లో కొన్ని గంటల పాటు పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ‘వాహన్', ‘సారథి’ పోర్టల్ సేవ లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక మీదట రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు.