స్తంభించిన రవాణా సేవలు
‘మీసేవ’లో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేయడంలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో శనివారం రవాణా శాఖకు సంబంధించి పలు సేవలు నిలిచిపోయాయి. స్లాట్స్ బుకింగ్, ట్రాన్సక్షన్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ‘మీసేవ’లో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేయడంలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో శనివారం రవాణా శాఖకు సంబంధించి పలు సేవలు నిలిచిపోయాయి. స్లాట్స్ బుకింగ్, ట్రాన్సక్షన్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇటీవల మీసేవకు సంబంధించిన పలు సేవల ధరలు పెరగడంతో పోర్టల్‌ను అత్యాధునీకరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అప్పటికే స్లాట్స్ బుకింగ్ చేసుకున్న వారు సైతం ‘మీసేవ’లో పేమెంట్స్ చేయాల్సి ఉండటంతో సేవలకు బ్రేకులు పడ్డాయి. దీంతో పలు ఆర్టీఏ కార్యాలయాలు వెలవెలబోయాయి. అంతేకాదు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం వంటి ముఖ్యమైన సేవల కోసం వచ్చిన ప్రజలు సర్వర్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు తమకు అవసరమైన ధ్రువీకరణపత్రాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మీసేవ పోర్టల్ ఆదివారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయని సిబ్బంది తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

