ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 14, 2020 , 23:58:31

సృజనశీలురు..

సృజనశీలురు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌

రాష్ట్ర స్థాయి వర్చువల్‌ ఎగ్జిబిషన్‌కు జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: ఇన్నోవేషన్‌.. ఇప్పుడు యావత్‌ ప్రపంచం జపిస్తున్న మంత్రమిదే. ఏ మూల, ఏ వంక తొంగి చూసినా.. వినూత్న ఆవిష్కరణలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతిభావంతుల ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెల్‌ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎగ్జిబిషన్లను నిర్వహిస్తూ వారిలోని ప్రతిభకు పదునుపెడుతున్నారు. ఈ ఏడాది కరోనా మూలంగా వర్చువల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు హైదరాబాద్‌ జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. శనివారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఈ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ శ్వేతామహంతి ప్రారంభించనున్నారు.


logo